Samsung: టీవీలు,గృహోపకరణాలపై శాంసంగ్‌ మరో కీలక నిర్ణయం!

Samsung Reduce Tv and Home Appliances Production - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఫీచర్‌ ఫోన్‌లు, గెలాక్సీ ఎఫ్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీ నిలిపివేసింది. అయితే తాజాగా టీవీలు, హోం అప్లయన్సెస్‌ల తయారీని తగ్గిస్తున్నట్లు తేలింది. 

వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, తగ్గుతున్న కన్జ్యూమర్‌ డిమాండ్‌లతో పాటు ఉక్రెయిన్‌ పై రష్యా యుద‍్ధం కారణంగా ఆయా ప్రొడక్ట్‌ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్‌ తగ్గించి, ఉన్న వాటిని అమ్మేందుకు సిద్ధమైంది. 

సాధారణంగా ఏదైనా సంస్థ మార్కెట్‌లో అమ్మే వస్తువు వారం లేదా రెండు వారాల్లో అమ్ముడు పోతుంది. కానీ ఈ ఏడాది క్యూ2లో నెలలు గడుస్తున్నా శాంసంగ్‌కు చెందిన వస్తువులు అమ్ముడు పోవడం లేదని, గతేడాది ఇదే క్యూ2లో ఏ వస్తువైనా అలా అమ్మకానికి పెట్టిన రెండు వారాల్లో అమ్ముడు పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువగా ఉండడం, ఆర్ధిక మాధ్యం, ఇతర కారణాల వల్ల కొనుగోలు దారులు ప్రొడక్ట్‌లపై ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో తయారు చేసిన ప్రొడక్ట్‌లు అమ్ముడు పోక మిగిలిపోతున్నాయి. వాటిని సేల్‌ చేసేందుకు తయారీలో శాంసంగ్‌ పరిమితి విధిస్తూ  నిర్ణయించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top