కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్‌బీ!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది.
ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్‌బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది.
చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!