పతంజలి ఫుడ్స్‌ ఓఎఫ్‌ఎస్‌ సక్సెస్‌ | Sakshi
Sakshi News home page

పతంజలి ఫుడ్స్‌ ఓఎఫ్‌ఎస్‌ సక్సెస్‌

Published Sat, Jul 15 2023 5:00 AM

Patanjali OFS fully subscribed, stock hits 5percent upper circuit - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌ చేపట్టిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విజయవంతమైంది. శుక్రవారం ముగిసిన ఇష్యూకి రెండు రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 3 రెట్లు, సంస్థాగత వర్గాల నుంచి 2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ప్రమోటర్‌ సంస్థ పతంజలి ఆయుర్వేద్‌ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా పతంజలి ఫుడ్స్‌లో 7 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. తద్వారా కంపెనీలో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు తెరతీసింది.

ఓఎఫ్‌ఎస్‌లో 25,33,964 షేర్లను ఆఫర్‌ చేయగా.. 76,34,567 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. రిటైలేతర ఇన్వెస్టర్లకు గురువారమే 2.28 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 4.56 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. వెరసి 2,53,39,640 షేర్లను విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్‌ ధరను పతంజలి ఆయుర్వేద్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఇష్యూతో ప్రస్తుతం కంపెనీలో 19.18 శాతంగా ఉన్న పబ్లిక్‌ వాటా 25 శాతానికిపైగా చేరనుంది.
ఓఎఫ్‌ఎస్‌ నేపథ్యంలో పతంజలి ఫుడ్స్‌ షేరు బీఎస్‌ఈలో 5% జంప్‌చేసి రూ. 1,225 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement