
Parker Solar Probe: Jaw Dropping Footage from the First Spacecraft to Touch the Sun: నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడిన విషయం తెలిసిందే. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా ప్రయోగించింది. సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రవేశించింది. సూర్యుడి వాతావరణంలోకి వెళ్లిన అద్భుతమైన క్షణాలను పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది. ఈ వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది.
వీడియోలో ఎన్నో అద్భుతాలు..!
సూర్యుడి నుంచి 4.89 మిలియన్ కిలోమీటర్ల వాతావరణంలోకి ప్రవేశించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అద్భుతమైన క్షణాలను రికార్డు చేసింది. 13 సెకన్ల టైమ్ లాప్స్ వీడియోలో సూర్యుడి కరోనా లోపలి ఫోటోలను క్యాప్చర్ చేసింది పార్కర్. అందులో కరోనల్ స్ట్రీమర్స్ అని పిలిచే దృగ్విషయాన్ని ప్రోబ్ రికార్డు చేసింది.
మునుపెన్నడూ లేని విధంగా సౌర వాతావరణంలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తించిందని పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త నూర్ రౌవాఫీ వివరించారు. ఈ వీడియో శాస్త్రవేత్తలకు మాగ్నెటిక్ ఫీల్డ్ , సోలార్ విండ్ డేటాలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ వీడియోలో పాలపుంతతో పాటుగా సౌర కుటుంబంలోని పలు గ్రహాలను పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది.
బుధ, గురు, శుక్ర, శని, అంగారక గ్రహాలతో పాటుగా భూమిని కూడా పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది. రాబోయే సంవత్సరాల్లో సూర్యుని ఉపరితలానికి పార్కర్ సోలార్ ప్రోబ్ మరింత దగ్గరగా చేరుకోనుందని నాసా హెలియోఫిజిక్స్ విభాగం డైరెక్టర్ నిక్కీ ఫాక్స్ చెప్పారు.
చదవండి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..!అదెలా సాధ్యమైందంటే..?