కార్పొరేట్ కంపెనీలకు కొత్త తలనొప్పి.. తీరు మార్చుకోవాల్సిందే, లేదంటే! | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల రూపంలో కంపెనీలకు కొత్త తలనొప్పి.. తీరు మార్చుకోవాల్సిందే, లేదంటే

Published Sun, Dec 10 2023 9:35 AM

Moonlighting To Job Hopping: How Genz Is Changing The Workplace - Sakshi

మూన్‌లైటింగ్‌, క్వైట్‌ క్విట్టింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌. ఆఫీసుల్లోని ఈ కొత్త పోకడలు సంస్థలకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో ఉద్యోగులు వరస రాజీనామాలు.. వారిని నిలుపుకోవడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. 
 
ఈ తరుణంలో జెన్‌జెడ్‌ విషయంలో కంపెనీల తమ పనితీరును మార్చుకోవాల్సిందేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వర్క్‌ఫోర్స్‌ని నిలుపుకోవడం కష్టమేనని సలహా ఇస్తున్నారు. వాటిల్లో పలు అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి.  

మూన్‌లైటింగ్‌ కారణం ఇదే
జెన్‌జెడ్‌లు 9 టూ 5 ఉద్యోగాల్ని అస్సలు ఇష్టపడరు. వాళ్లకి వర్క్‌ అనుకూలంగా ఉండాలి. ఎంత జీతం అనే పట్టింపు ఉండదు. కానీ పని విషయాల్లో మార్పులు తెచ్చేందుకు, కొత్త అవకాశాల్ని సృష‍్టించుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. వృత్తిపరంగా ఎదిగేందుకు, ఆర్ధికంగా స్థిరపడేందుకు మూన్‌లైటింగ్‌ ధోరణులను అవలంభిస్తారనే విషయాన్ని కంపెనీలు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టే వారి అభిరుచులకు అనుగుణంగా లేని కంపెనీలు ఉద్యోగుల్ని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయని, అందువల్ల మారుతున్న ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా సంస్థలు తమ పని వాతావరణంలో మార్పులు చేయడంతో పాటు వారిని నిలుపుకునేందుకు వ్యూహాలను అమలు చేయాలని సలహా ఇస్తున్నారు. 

చేసే పనికి గుర్తింపు ఉంటే  
సంస్థలు జెన్‌ జెడ్‌ ఉద్యోగులు చేస్తున్న పనిని ప్రశంసలు కురిపించడం, వాళ్లు చెప్పే మాటల్ని వినడం, వాళ్లు చేసే పనికి గుర్తింపు ఇవ్వడం చేయాలి. ఇలాంటి సంస్థల్ని అసలు వదిలి పెట్టరు. ఈ విషయంలో సంస్థలు తమ వైఖరి మార్చుకోవాలి. లేదంటే క్వైట్‌ క్విట్టింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌ వంటి ధోరణి ఎక్కువతుంది’ అని గెట్ వర్క్ డైరెక్టర్ అండ్‌ సిఓఓ పల్లవి హిర్వానీ అన్నారు. జనరేషన్ జెడ్‌లు కొత్త పుంతలు తొక్కతున్న టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థలు భావిస్తాయి. అయితే టెక్నాలజీ వినియోగంలో కంపెనలు తమ పనికి తగ్గట్లు సన్నద్ధం కావాలని ఆశిస్తున్నారు.  

ఉద్యోగుల కెరియర్‌కి సహాయం చేస్తున్నారా?
జెన్ జెడ్ ఉద్యోగులు వేతనం, అదనంగా ఇతర ప్రయోజనాలు, ప్రోత్సహాకాల్ని కోరుకుంటున్నారు. దీంతో పాటు హెల్త్ కేర్ కవరేజీ, మెంటల్ హెల్త్ సపోర్ట్, పెయిడ్ టైమ్ ఆఫ్ వంటి ప్రయోజనాలు అందిస్తున్న కంపెనీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. అదనంగా, అవకాశాల అపారంగా ఉండి వాటిని నిరూపించుకునేలా మెంటార్షిప్ వంటి ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తే మరీ మంచిది.   

మార్పు మంచికే 
కాబట్టే సిబ్బంది కొరతతో బాధపడుతున్న కంపెనీలు వర్క్‌ఫోర్స్‌కి అనుగుణంగా మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని పల్లవి హిర్వానీ పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ఉద్యోగుల నైపుణ‍్యాల్ని ఆయా సంస్థలు సమర్ధవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

జెన్‌జెడ్‌ అంటే ఎవరు?
వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్‌ జనరేషన్‌. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో..అంటే 1946–1964 మధ్య పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్‌’ జనరేషన్‌గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్‌ ఎక్స్‌. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్‌ వై. అంటే మిలీనియల్స్‌. ఆ తరవాత పుట్టిన వారిని ‘జనరేషన్‌ జెడ్‌’గా పిలుస్తున్నారు.

Advertisement
Advertisement