మార్కెట్‌లోకి కోవిడ్‌కి ఔషధం.. ముందుగా హైదరాబాద్‌లోనే

Molnupiravir Tablet Release in Hyderabad Market As Melcovir By Optimus Pharma - Sakshi

కరోనా మహమ్మారిని అయిదు రోజుల్లో కట్టడి చేయగలిగే సామర్థ్యం కలిగిన ఔషధంగా చెప్పుకుంటున్న మోల్నుపిరావిర్‌ ఇండియాలో ముందుగా హైదరాబాద్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనార్హం. 

మోల్‌కోవిర్‌
మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన పదమూడు కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్‌ సంస్థ మోల్‌కోవిర్‌ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని గురువారం హైదరాబాద్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా మెల్నుపిరావిర్‌ని రేపోమాపో మార్కెట్‌లోకి తెచ్చేందుకు మిగిలిన కంపెనీలు కూడా యుద్ధప్రతిపాదికన పని చేస్తున్నాయి.

భరోసా
ఓవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి కలవరపెడుతుంటే మరోవైపు థర్డ్‌ వేవ్‌ భయాలు దేశాన్ని కమ్మేస్తున్నాయి. ఈ తరుణంలో కరోనాకి విరుగుదుగా మోల్నుపిరావిర్‌ ఔషధం అందుబాటులోకి రావడం అంది ముందుగా హైదరాబాద్‌లో రిలీజ్‌ కావడం భాగ్యనగర వాసులకు వరంలా మారింది.ఔ

చదవండి: కోవిడ్‌ ఔషధం వచ్చేసింది!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top