లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా? | Jaipur Man Buys Ather Electric Scooter Using Rs 10 Coins | Sakshi
Sakshi News home page

లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?

Feb 20 2024 3:16 PM | Updated on Feb 20 2024 3:52 PM

Jaipur Man Buys Ather Electric Scooter Using Rs 10 Coins - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్‌లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్‌ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి.

ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement