ఐటీ సర్క్యులర్‌ వచ్చిందోచ్‌.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?

IT Circular Deduction from Salaries during the Financial year 2022-23 - Sakshi

డిసెంబర్‌ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్‌ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్‌ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇందులో ఏమి ఉంటాయి అంటే.. 
►   జీతం అంటే ఏమిటి.. పెర్క్స్‌ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు 
►   శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి 
►  టీడీఎస్‌ ఎలా లెక్కించాలి 
►   ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి 
►  ఎరియర్స్‌ జీతం, అడ్వాన్స్‌ జీతం లెక్కింపు 
►   జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి 
►  ఇంటి లోన్‌ మీద వడ్డీ, షరతులు 
►  విదేశాల నుంచి వచ్చే జీతం 
►   టీడీఎస్‌ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి,   రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్‌ సర్టిఫికెట్‌ ఫారం 16 ఎలా జారీ చేయాలి,

ఎప్పుడు దాఖలు చేయాలి 
►  పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు 
►  ఏయే మినహాయింపులు ఉన్నాయి 
►  ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. 
►  ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర  రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి 
►  సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు,   పద్ధతులు, నోటిఫికేషన్లు 
►  డ్రాయింగ్‌ ఆఫీసర్లు చేయాల్సిన విధులు 
►   పలు ఉదాహరణలు. 

ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్‌ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్‌ ప్రోబ్లెమ్‌కి రెడీమేడ్‌ సొల్యూషన్‌.. రెడీ రిఫరెన్స్‌.. రెడీ రెకనార్‌ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top