ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా? IndiGo aircraft narrowly breached safety margins when landing as an Air India flight was taking off. Sakshi
Sakshi News home page

ఒకే రన్‌వేపై రెండు విమానాలు! నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

Published Mon, Jun 10 2024 12:13 PM | Last Updated on Mon, Jun 10 2024 2:04 PM

IndiGo plane landing and an Air India aircraft takeoff from the same runway less than a minute

ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.

ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్‌లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..

జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్‌ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్‌ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.

ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!

ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్‌డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement