హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలకు అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. ఈ అమ్మకాలను వెన్యూ సేల్స్ బాగా సహాయపడ్డాయి. దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.
2026 ఏప్రిల్ నెలలో కంపెనీ 51,902 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 ఏప్రిల్ అమ్మకాలతో (44,374 యూనిట్లు) పోలిస్తే 17 శాతం ఎక్కువ. దేశీయ అమ్మకాలలో వృద్ధి కనపరిచినప్పటికీ.. ఎగుమతులు 16 శాతం తగ్గాయి.
గత ఏడాది ఏప్రిల్ నెలలో 16,400 యూనిట్లును హ్యుందాయ్ ఎగుమతి చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 13,708 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. వెన్యూ సేల్స్ 12420 యూనిట్లతో బ్రాండ్ పాపులర్ సేల్ మోడల్ అయింది. తరువాత స్థానంలో ఎక్స్టర్ ఎస్‌యూవీ, వెర్నా సెడాన్, ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా సమ్మర్ ఎడిషన్ ఎస్‌యూవీ, గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఉన్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!


