మళ్లీ షాకిచ్చిందిగా హ్యుందాయ్‌: ఐ20 ఎన్‌-లైన్‌ ధరల పెంపు, ఆ వేరియంట్లు ఔట్‌

Hyundai i20 N Line Price Hike Turbo Petrol iMT Variants Removed - Sakshi

సాక్షి, ముంబై:  దక్షిణ ఆఫ్రికా  కారు దిగ్గజం హ్యుందాయ్‌ తన కస్టమర్లకు  బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. హ్యుందాయ్  ఐ20, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కార్ల ధరలును మరోసారి పెంచేసింది.  ఈ మేరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఐ20 లైనప్ కార్ల ధరలు పెరగడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఫెస్టివల్ సీజన్ ముందు సెప్టెంబర్‌లో ధరలను పెంచింది.  ఐ 20  లైనప్లో  వేరియంట్లను బట్టి రూ.21,500 వరకు ధర పెరగనుంది.

ఐ20 హ్యాచ్‌బ్యాక్ మోడల్ లైనప్ నుండి1.0L టర్బో-పెట్రోల్ iMT వేరియంట్‌లను (స్పోర్ట్జ్ టర్బో  ఆస్టా టర్బో) తొలగించింది. ఇపుడిక  టర్బో-పెట్రోల్ ఇంజన్ స్పోర్ట్జ్ , ఆస్టా ట్రిమ్‌లలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో  మాత్రం ఐ20 అందుబాటులో ఉంటుంది. వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు, కార్‌మేకర్ హ్యుందాయ్ ఐ20 ధరలను రూ. 21,500 వరకు పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత, హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 7.18 లక్షల నుండి రూ. 10.91 లక్షల వరకు ఉంటుంది.

మోడల్ లైనప్‌లో మూడు 1.0L టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లు ఉన్నాయి . Sportz DCT, Asta DCT ,  Asta DCT డ్యూయల్-టోన్ - ధర రూ. 10.11 లక్షలు, రూ. 11.68 లక్షలు, రూ. 11.83 లక్షలు. నాలుగు 1.5L డీజిల్ వేరియంట్‌లు లలో మాగ్నా (రూ. 8.42 లక్షలు), స్పోర్ట్జ్ (రూ. 9.28 లక్షలు), ఆస్టా (ఓ) (రూ. 10.83 లక్షలు) , ఆస్టా (ఓ) డ్యూయల్-టోన్ (రూ. 10.98 లక్షలు). పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top