ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్‌, ఎలా పనిచేస్తుంది?

How to access Tax department AIS app key details - Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను శాఖ తాజాగా ఏఐఎస్‌ ట్యాక్స్‌పేయర్‌ పేరిట మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది.  ఇందులో తమ మొబైల్ ఫోన్‌లలో వార్షిక సమాచారాన్ని, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాని చూడవచ్చు. ఇది  పన్ను చెల్లింపుదారుల టీడీఎస్‌/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు మొదలైన వాటి సమగ్ర సమాచారాన్ని ఒకే దగ్గర చూసుకునేందుకు, ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.

టీఏఎస్‌  అంటే టేక్స్‌ పేయర్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ సమ్మరీని, ఏఐఎస్‌  యాన్సువల్‌ ఇన్‌ఫర్మేషన్‌  స్టేట్‌మెంట్‌ వివరాలు ఉంటాయి.  ఈ సమాచారం అందించే యాప్‌ గూగుల్‌ ప్లే, యాప్‌ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ పాన్‌ నంబర్‌ ద్వారా ఈ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top