
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు.
దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్‌లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు.