మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!

Here is How To Change Photograph in Your Aadhaar - Sakshi

ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తనవెంట కలిగి ఉండాల్సిన గుర్తింపు పత్రాలలో ఆధార్‌ కార్డు చాలా ముఖ్యమైనది. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా, విద్యాలయాల్లో అడ్మిషన్లు, సిమ్‌ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను వంటి ప్రతిదాని కోసం ఆధార్‌ కార్డు తప్పనిసరి. వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్‌ సమాచారం కూడా ఈ 12 అంకెల గల కార్డులో నిక్షిప్తమై ఉన్నందున దీని భద్రత చాలా ముఖ్యం.

అయితే, చాలా మంది ఆధార్‌ కార్డుల్లో తమ వివరాలను సరిచేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వాటిలో ఆధార్‌ కార్డుపై ఉన్న ఫొటో ఒకటి. వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. మరి చాలా ఏళ్ల క్రితం తీసిన ఆధార్‌పై ఫొటోకు ఇప్పటి మన ముఖానికి అసలు పోలికలే ఉండవు. అలాంటప్పుడు గుర్తింపు తప్పనిసరైన చోట ఏదైనా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఆధార్‌ కార్డుపై ఉన్న ఫొటోను ఎలా మార్చుకోవలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..! 

  • మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • ఆపై కరెక్షన్/అప్‌డేట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ వివరాలను నింపండి.
  • ఆపై ఫారమ్‌ను మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లండి.
  • ఫారమ్‌లో నింపిన వివరాలను బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సెంటర్ ఎగ్జిక్యూటివ్ ధృవీకరిస్తారు.
  • ఆ తర్వాత మీరు రూ.100 + జీఎస్టీ చెల్లించాలి.
  • అప్పుడు అతను మీ కొత్త ఫోటో తీసిన తర్వాత మీకు URN స్లిప్ అందిస్తారు.
  • URN ద్వారా మీ ఫోటో అప్‌డేట్ స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు.

కొత్త ఫోటో గల ఆధార్ కార్డ్ అప్‌డేట్ కావడానికి గరిష్టంగా 90 రోజుల వరకు సమయం పట్టవచ్చు.

(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top