ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!

ఎస్‌బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/t1GGRRxWjx
— State Bank of India (@TheOfficialSBI) March 20, 2022
(చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!)
మరిన్ని వార్తలు