హీట్‌ బీటర్స్‌.. కూల్‌గా ఉంచే బెస్ట్‌ గాడ్జెట్స్‌! | Heat Beaters Gadgets That Keep You Cool This Summer | Sakshi
Sakshi News home page

హీట్‌ బీటర్స్‌.. కూల్‌గా ఉంచే బెస్ట్‌ గాడ్జెట్స్‌!

May 10 2026 5:28 PM | Updated on May 10 2026 6:03 PM

Heat Beaters Gadgets That Keep You Cool This Summer

వేసవిలో ఎండ ఎంత పెరిగినా, మిమ్మల్ని మాత్రం కూల్‌గా ఉంచే బెస్ట్‌ హెల్పర్సే ఈ చిన్న గాడ్జెట్స్‌! ఇవి వేసవి కాలంలో చాలా ఉపయోగపడతాయి. ధర కూడా కొంత తక్కువగానే ఉండటం గమనార్హం. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ..

చల్లని టచ్‌తో గ్లోయింగ్‌ స్కిన్!
వేసవిలో కూడా మీ ఫేస్‌ ఎప్పుడూ ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న ఐస్‌ రోలర్‌ బ్యూటీ టూల్‌ మీ డైలీ స్కిన్ కేర్‌లో ఒక సూపర్‌ హెల్పర్‌ అవుతుంది. దీనిని ఫ్రిజ్‌లో కొద్దిసేపు పెట్టి, తర్వాత ముఖంపై నెమ్మదిగా రోల్‌ చేస్తే చల్లని థెరపీ లభిస్తుంది. ఇది ముఖానికి రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఇచ్చి, పఫీనెస్‌ తగ్గించడంలో, స్కిన్ మరింత ఫ్రెష్‌గా కనిపించడంలో సహాయపడుతుంది. సిలికాన్‌తో తయారైన ఈ రోలర్‌ మళ్లీ మళ్లీ వాడుకునేలా డ్యూరబుల్‌గా డిజైన్ చేశారు. నీళ్లు లేదా గ్రీన్ టీ, రోజ్‌ వాటర్‌ లాంటి వాటితో ఫ్రీజ్‌ చేసి మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ధర కేవలం రూ. 140 మాత్రమే!

మెడలోనే రక్షణ కవచం!
బయట అడుగు పెడితే చాలు... దుమ్ము, ధూళి, పొగతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే వేరబుల్‌ పోర్టబుల్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ మీ దగ్గర ఉండాల్సిందే! ఇది మీ మెడలో ఉంటే చాలు, మీరు ఎక్కడికి వెళ్లినా చల్లని, స్వచ్ఛమైన గాలి మీ వెంటే ఉంటుంది! గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలను, పొగను సెకన్లలో తొలగించి, ఇది గాలిని 99 శాతం స్వచ్ఛంగా మారుస్తుంది. పైగా ఫిల్టర్‌ మార్చాల్సిన అవసరం లేకుండా సులభంగా వాడుకునేలా డిజైన్  చేశారు. ట్రావెల్‌లో, ఆఫీస్‌లో లేదా బయట ఎక్కువసేపు ఉండాల్సిన వారికి ఇది ఒక స్మార్ట్‌ సపోర్ట్‌. ధర కేవలం రూ. 3,200.

కూల్‌గా గేమ్‌ ఆడండి!
వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు లేదా వీడియోలు ఎక్కువసేపు చూస్తుంటే ఫోన్ వేడెక్కి స్లో అవుతుందా? అయితే ఈ చిన్న ‘ఫోన్ కూలర్‌’ మీకు ఒక సూపర్‌ సొల్యూషన్. ఈ కూలర్‌ను ఫోన్‌కు జత చేస్తే చాలు, వేడి త్వరగా తగ్గించి ఫోన్‌ను కూల్‌గా ఉంచుతుంది. రెండు పవర్‌ మోడ్స్‌ ఉండటంతో అవసరానికి తగ్గట్టు కూలింగ్‌ లెవల్‌ను ఎంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌ లేదా లాంగ్‌ కాల్స్‌ సమయంలో ఇది మంచి సపోర్ట్‌గా ఉంటుంది. చిన్న సైజ్‌లో ఉండటం వల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు ఏ అసౌకర్యం కలగదు. పైగా ఎక్కువ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ధర కేవలం రూ. 1,100.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement