పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు | Today Gold And Silver Prices Jan 04th In Hyderabad And Other Cities, See Details Inside - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Jan 4 2024 11:35 AM | Updated on Jan 4 2024 12:52 PM

gold silver prices today 4 january 2024 - Sakshi

Gold Rate Today: బంగారం, వెండి ధరల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున మోస్తరుగా తగ్గిన పసిడి, వెండి ధరలు ఈరోజు (జనవరి 4) భారీగానే దిగివచ్చాయి.

హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 చొప్పున తగ్గి రూ. 58,100 లకు వచ్చింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 440 క్షీణించి రూ.63,380 లకు చేరింది. క్రితం రోజు 22, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 58,500, రూ. 63,820 చొప్పున ఉండేవి.

క్లిక్‌ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.2,000 తగ్గింది. నగరంలో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 78,000 ఉంది. ఇది నిన్నటి రోజున రూ.80,000 ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement