ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి!

Facebook May Layoff 12000 Employees Says Report - Sakshi

ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌ సిద్ధమైంది. కంపెనీ చరిత్రలో మొదటి సారిగా భారీస్థాయిలో ఉద్యోగులను ఇంటికి సాగనంపనుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే.. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ నేతృత్వంలోని మెటా ఉద్యోగులు గ‌డ్డు ప‌రిస్ధితులు ఎదుర్కొవడం తప్పేలా లేదు. సంస్థలోని వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి  దాదాపు 12,000 మందిని తీసివేయనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణంగా.. స‌రైన సామ‌ర్ధ్యం క‌న‌బ‌ర‌చ‌ని ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది.

జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల మెటా ఎర్నింగ్స్ కాల్‌లో ఈ అంశంపై తేల్చిచెప్పారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఫేస్‌బుక్ మే నుంచి ఉద్యోగుల హైరింగ్‌ ప్రక్రియను నిలపేసిన సంగతి తెలిసిందే. దీని మరింత కాలం పొడిగించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ హైరింగ్‌ నిలిపివేతతో పాటు ఖర్చులు కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆశించిన సామ‌ర్ధ్యం ప్ర‌ద‌ర్శించ‌ని 15 శాతం మంది ఉద్యోగుల‌పై కంపెనీ వేటు తప్పదని నివేదికలు బయటరావడంతో ఫేస్‌బుక్‌ టెకీలలో అందోళన మొదలైంది. 

రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యోగుల లేఆఫ్స్‌ దిశగా ఫేస్‌బుక్‌ అడుగులు వేస్తోంది. మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరం కావడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం, ఇలాంటి ప్రతికూల పరిణామాలు వల్ల చిన్న కంపెనీలతో పాటు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని కంపెనీలపై ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.

చదవండి: బ్యాంక్‌ కస్టమర్లకు వార్నింగ్‌.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్‌ చేసేయండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top