
లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్‌ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ.. ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది.
ఆగస్టు 13, 2025 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం.. UANలో సభ్యుని పేరు, లింగం, పుట్టిన తేదీ ఆధార్‌తో సరిగ్గా సరిపోలితే, యజమాని పోర్టల్‌లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్‌ను సీడ్ చేయవచ్చు. దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు.
UAN & ఆధార్ సీడింగ్
యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన 12 అంకెల ఐడెంటిఫైయర్. వ్యక్తి ఉద్యోగాలు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆధార్‌ను UANకి లింక్ చేయడం వలన సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు. కానీ ఆధార్ డేటా.. యూఐడీఏఐ ద్వారా ధృవీకరణ పొందాల్సిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి.
ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఆధార్ లింక్ ఎలా?
ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి.. ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయలి.
➤తరువాత యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి.
➤ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి.
➤ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. ఆధార్ నెంబరుకు లింక్ అయిన మొబైల్ & ఈమెయిల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
➤ఇవన్నీ పూర్తిగా తరువాత ఆధార్ UANతో లింక్ అవుతుంది.