వింత వాహనం.. నేల మీద, నీటిపైనా ఎక్కడైనా ప్రయాణించగలదు!

Dreadnort Boats multipurpose POD - Sakshi

టెక్‌ టమారం

న్యూజీలాండ్‌కు చెందిన పడవల తయారీ కంపెనీ ‘డ్రెడ్‌నార్ట్‌ బోట్స్‌’ ఈ పోర్టబుల్‌ మల్టీయూజ్‌ పాడ్‌ను రూపొందించింది. చూడటానికి ఇది ఏదో విచిత్ర గ్రహాంతర వాహనంలా కనిపిస్తుంది గాని, ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటి మీద ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ‘డ్రెడ్‌నార్ట్‌ బోట్స్‌’ నిపుణులు సునామీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

(ఐఫోన్‌ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్‌ పాత మోడళ్లు ఇవే..)

ఈ వాహనం కిటికీలకు దృఢమైన అద్దాలు, మిగిలిన భాగాలను భారీ నౌకల తయారీకి ఉపయోగించే నాణ్యమైన అల్యూమినియం ఉపయోగించారు. వాహనం లోపల విశాలమైన స్థలం, వాహనంలోనే వివిధ పరికరాలను చార్జ్‌ చేసుకునేందుకు వీలుగా 350 వాట్స్‌ సామర్థ్యం గల ఇన్వర్టర్‌ వంటివి ఏర్పాటు చేశారు. వాహనం పైభాగంలో అమర్చిన సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఇది పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడుస్తుంది. దీని ధర 61,243 డాలర్లు (రూ.50.40 లక్షలు) మాత్రమే!

(sleepisol: ఈ హెడ్‌సెట్‌ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top