క్రెడిట్‌ కార్డుల హవా | Credit card transaction volumes increased to 570 crore in calendar year 2025 | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డుల హవా

May 20 2026 3:37 AM | Updated on May 20 2026 7:44 AM

Credit card transaction volumes increased to 570 crore in calendar year 2025

భారీగా పెరుగుతున్న వినియోగం 

2025లో 570 కోట్ల లావాదేవీలు 

యూపీఐదీ అదే తీరు 

తగ్గిపోతున్న డెబిట్‌ కార్డుల వాడకం 

ఆర్‌బీఐ నివేదికలో ఆసక్తికర అంశాలు

ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్‌ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్‌ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది.  

నివేదికలోని అంశాలు.. 
డెబిట్‌ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. 
డెబిట్‌ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. 

యూపీఐ, డిజిటల్‌ వాలెట్లు, క్రెడిట్‌ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్‌ కార్డుల కంటే డెబిట్‌ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. 
ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్‌ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. 

ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. 
విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. 
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు డిసెంబర్‌ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్‌ కార్డులను జారీ చేశాయి.

డిజిటల్‌ చెల్లింపుల విస్తరణ 
2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. 
ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి.   

2025 జూన్‌లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్‌ కోడ్‌లు, డిసెంబర్‌ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. 
డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్‌–డిసెంబర్‌ మధ్య యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లు, క్రెడిట్‌ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్‌ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.

యూపీఐ, డిజిటల్‌ వాలెట్లు, క్రెడిట్‌ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్‌ కార్డుల కంటే డెబిట్‌ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. 
ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్‌ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. 

ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. 
విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. 
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు డిసెంబర్‌ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్‌ కార్డులను జారీ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement