China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!

China Stands To Gain As Taliban Inherits Untapped 1 Trillion Trove Of Minerals - Sakshi

తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడంతో అఫ్గనిస్తాన్‌ కు ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తాలిబన్ల రాకతో పలు దేశాల వాణిజ్య రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. కాగా అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా తన కుటీలబుద్దిని మరో సారి బయటకు తెలిపిన విషయం తెలిసిందే..! తాలిబన్లు తమతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. అఫ్గనిస్తాన్‌ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయం అందిస్తామని డ్రాగన్‌ దేశం వెల్లడించింది.కాగా చైనా దేశపు  కుటీలనీతి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. 
చదవండి: Google: ఆ స్మార్ట్‌ఫోన్లు ఇకపై కనిపించవు...!

అఫ్గనిస్తాన్‌తో చైనా దోస్తీ దాని కోసమేనా...!
అఫ్గనిస్తాన్‌ను సొంతం చేసుకున్న తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన ఐదో ఉగ్రవాద సంస్థ అని అమెరికా వెల్లడించింది. తాలిబన్ల రాకతో ఇప్పటికే అఫ్గనిస్తాన్‌లోని ప్రపంచంలో అత్యధిక లిథియం ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను అఫ్గనిస్తాన్‌ తమ అధీనంలోకి తీసుకుంది. ఇంతవరకు వెలికితీయని ఖనిజాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్నాయి వీటి విలువ సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లకు ఉండనుంది. ఈ ఖనిజాలు పునరుత్పాదక శక్తిగా మార్చే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం బాక్సెట్‌, రాగి, ఇనుప ఖనిజం, వంటి అరుదైన నిక్షేపాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది.

విద్యుత్‌ కేబుల్స్‌ తయారుచేయడానికి రాగి వంటి లోహల ధర ప్రపంచ మార్కెట్‌లో భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా నిష్క్రమించడంతో చైనా కు మార్గం సులువైంది.  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా తాలిబన్లతో స్నేహం చేయడానికి సిద్ధంకావడంతో వారి మైత్రి ప్రపంచదేశాలపైనా భారీ ప్రభావం ఉంటుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్కలమైన ఖనిజసంపదను కలిగి ఉన్న అఫ్గనిస్తాన్‌ దేశం చైనాకు ఎల్‌డోరాడ్‌గా మారనుందని ఫ్రెంచ్‌ నిపుణుడు పిట్రాన్‌ హెచ్చరించాడు.  దీంతో చైనా ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లను శాసించడానికి భారీ పన్నాగమే పన్నిందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

పునరుత్పాదకత రంగంపై భారీ దెబ్బ..!
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ పెరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు పునరుత్పాదకత శక్తిపై అడుగులు వేస్తున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో ఉపయోగించే అరుదైన నియోడైమియం, ప్రెసోడైమియం, డైస్ప్రోసియం వంటి ఖనిజాలు అఫ్గన్‌ సొంతం.  ఎలక్ట్రిక్‌ కార్‌ బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్‌, విండ్‌ఫామ్‌లను తయారుచేయడానికి లిథియం కీలకమైన అంశం. అంతర్జాతీయ ఇంధన సంస్ధ ప్రకారం లిథియంకు ప్రపంచ వ్యాప్తంగా 2040 నాటికి 40 రెట్ల మేర డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంది. 

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top