Tesla Car: ఇలా అయితే ఒకే... టెస్లాకు ఇండియా ఆఫర్‌ ?

Centre Asks Tesla To Begin Production Before Tax Concessions Given - Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే విషయంలో టెస్లా పరిస్థితి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. టెస్లా  కార్ల అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన షరతులకు టెస్లా నేరుగా సమాధానం చెప్పడం లేదు, మరోవైపు ఇండియా మార్కెట్‌పై ఆశలు వదులకోవడం లేదు. దీంతో కార్ల అమ్మకంపై టెస్లాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది భారత ప్రభుత్వం .

ఇంపోర్ట్స్‌ ట్యాక్స్‌పై పీటముడి
విదేశాల్లో పూర్తిగా తయరైన కార్లను ఇండియాలో దిగుమతి చేసుకుంటే  ఇంజన్‌ సామర్థ్యం, ధర తదితర విషయాల ఆధారంగా కారు ధరలో 60 నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం విధిస్తోంది. అయితే తమవి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్‌ కార్లు కావడం వల్ల పన్ను మినహాయింపు ఇ‍వ్వాలంటూ టెస్లా చీఫ్‌ ఎలన్‌మస్క్‌ కోరారు. అయితే దీనికి ప్రతిగా కార్ల యూనిట్‌ను ఇండియాలో పెడతామంటే టెస్లాకు పన్ను రాయితీ అంశం పరిశీలిస్తామంటూ అధికారుల ద్వారా కేంద్రం ఫీలర్లు వదిలింది.

టెస్లా ఒంటెద్దు పోకడలు
కేంద్రం నుంచి ఓ మోస్తారు సానుకూల స్పందన రావడంతో తమ కార్లను ఇండియాకు తెచ్చే విషయంలో టెస్లా దూకుడు ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసేందుకు సన్నహకాలు చేస్తోంది. ముందుగా విదేశాల్లో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుంటామని... ఆ కార్ల అమ్మకాలు జరిపి ఆపై తయారీ ప్లాంటు నెలకొల్పుతామని చెప్పింది. ఆన్‌లైన్‌ , ఆఫ్‌లైన్‌ మోడ్‌లలో తమ కార్ల సేల్స్‌ ఉంటాయంటూ వార్తలు వ్యాపింప జేసింది.


అలా కుదరదు
ఇండియాలో కార్ల తయారీకి సంబంధించి స్పష్టమైన వైఖరి తెలపకుండా.. టెస్లా అనుసురిస్తున్న కప్పదాటు వైఖరిపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. ఇండియాలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే పన్ను రాయితీ ఇస్తామంటూ కుండబద్దలు కొట్టింది, అయితే ఈ విషయాన్ని నేరుగా నేరుగా ప్రస్తావించకుండా, అధికారుల ద్వారా ఫీలర్లు వదిలింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఘాటు రిప్లైకి టెస్లా ఎలా స్పందిస్తోందే వేచి చూడాలి

చదవండి: ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్‌ ఆఫర్స్‌ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top