టీవీఎస్‌ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్‌ | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్‌

Published Fri, Oct 15 2021 8:12 AM

BMW Bikes Are Manufacturing In TVS Plant - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న టీవీఎస్‌ మోటార్‌.. తమిళనాడులోని హొసూర్‌ ప్లాంటులో ఒక లక్ష బీఎండబ్ల్యూ మోటరాడ్‌ 310 సీసీ బైక్స్‌ను ఉత్పత్తి చేసింది. అయిదేళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటరాడ్స్‌ బైక్స్‌ ఉత్పత్తిలో హొసూర్‌ ప్లాంటు వాటా 10 శాతం ఉంది. 2013లో ఇరు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్‌ కోసం 500 సీసీ లోపు సామర్థ్యంగల బైక్స్‌ అభివృద్ధి, తయారీని టీవీఎస్‌ చేపట్టింది. 

ఈ క్రమంలో బీఎండబ్ల్యూ జి310 ఆర్, 310 జీఎస్, టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌ 310 బైక్స్‌ను ఇరు సంస్థలు పరిచయం చేశాయి. ఈ మూడు బైక్స్‌ కూడా హొసూర్‌లో తయారవుతున్నాయి. బీఎండబ్లు్య జి310 ఆర్, 310 జీఎస్‌ మోడళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో లభ్యమవుతున్నాయి.
 

Advertisement
Advertisement