
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే ఠక్కున చెప్పేది బిట్‌కాయిన్. చాలావరకు క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ ఎక్కువ ఆదరణ లభించింది. ఎల్‌సాల్వ్‌డార్, పరాగ్వే వంటి దేశాలు కూడా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తానమని వెల్లడించిన విషయం తెలిసిందే. బిట్‌కాయిన్‌ను మొదటిసారిగా 2008లో రూపోందించారు. బిట్‌కాయిన్ మార్కెట్ విలువ 2009లో 0.0094982452 డాలర్ల నుంచి మొదలై నేడు సుమారు 991.2 బిలియన్‌డాలర్లకు పెరిగింది.
చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
బిట్‌కాయిన్ ఒక కంటి కనిపించని క్రిప్టోకరెన్సీ. బిట్‌కాయిన్‌ను ఎవరు సృష్టించారంటే చెప్పడం చాలా కష్టం. దీన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సతోషి నకమోటో అనే పేరును ఉపయోగించి మొదట చెలామణీ వచ్చింది. సతోషి నకమోటో అనే పేరు ఒక వ్యక్తిదో లేకపోతే కొంతమంది వ్యక్తుల సమూహమో ఎవరీకి తెలియదు. బిట్‌కాయిన్‌తెలియరాలేదు. దీన్ని 2008లో రూపొందించారు.
తొలి విగ్రహ ఏర్పాటు..!
తాజాగా బిట్‌కాయిన్ సృష్టికర్త సతోషిక నకమోటో తొలి విగ్రహాన్ని గురువారం రోజున హంగేరీలోని బుద్దాపెస్ట్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు హజరయ్యారు. ఆవిష్కరణ వేడుకలో "స్టాచ్యూ ఆఫ్ సతోషి" ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు , క్రిప్టో న్యూస్ సైట్ క్రిప్టో అకాడెమియా ఎడిటర్, హంగేరియన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ సీఈవో డెబ్రేక్జెని బర్నబా హాజరయ్యారు.
Front of #StatueOfSatoshi pic.twitter.com/LvlDmtio1c
— Disclose.tv (@disclosetv) September 16, 2021
చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!