AVERA AI Mobility Launched First Facial Technology EV Scooter, Check Special Features - Sakshi
Sakshi News home page

ఫేషియల్‌ టెక్నాలజీతో పనిచేసే తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కి.మీ!

Feb 16 2022 7:31 AM | Updated on Feb 16 2022 2:27 PM

AVERA AI Mobility Pvt Ltd Launches First Facial Technology Ev Scooter - Sakshi

ఫేషియల్‌ టెక్నాలజీతో కూడిన తొలి ఈవీ 

అవెరా విన్సెరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌  

హైదరాబాద్‌: అవెరా ఏఐ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌ ‘అవెరా విన్సెరో’ అనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ‘దుబాయి ఎక్స్‌పో’లో ఆవిష్కరించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫేషియల్‌ టెక్నాలజీతో కూడిన తొలి స్కూటర్‌ ప్రపంచంలో ఇదేనని సంస్థ ప్రకటించింది. 100 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ స్కూటర్‌కు ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేయడమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. దుబాయి ఎక్స్‌పోలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఈ స్కూటర్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు వెంకట రమణ, సహ వ్యవస్థాపకురాలు చాందిని చందన సమక్షంలో.. భారత్‌లో యూఏఈ అంబాసిడర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఆల్బానా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: వైరస్‌,బ్యాక్టిరియా ప్రూఫ్‌ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement