ఆ విషయంలో ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంటాం - ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra Unveiled His Carbon Neutrality Road Map - Sakshi

మొన్నటికి మొన్న నెట్‌ జీరో స్కోరు సాధించినందుకు గర్వంగా ఉందంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆనంద్‌ మహీంద్రా.. ఈ రోజు తన గర్వానికి కారణం ఏంటో తెలియజేస్తూ మరో వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా ఉద్దేశంలో నెట్‌ జీరో అంటే కర్బణ ఉద్ఘారాలను సున్నాకి తీసుకురావడం. మహీంద్రా గ్రూపు ఉత్పాదనలు అన్నింటీని 2040 నాటికి నెట్‌ జీరోకి తీసుకువస్తామంటూ ఆయన తెలిపారు. వాయు కాలుష్యానికి సంబంధించి పారిస్‌ ఒప్పందం నెట్‌ జీరో టార్గెట్‌కి 2050 ఏడాదిని లక్ష్యంగా నిర్దేశించగా అంతకంటే పదేళ్ల ముందే తాము లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు.

నెట్‌జీరో లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో రియల్టీ, లైఫ్‌ స్పేసెస్‌ విభాగంలో మహీంద్రా గ్రూపు విప్లవాత్మక మార్పులు తేబోతున్నట‍్టు ఆనంద్‌ మహంద్రా మాటలను బట్టి తెలుస్తోంది. నిర్మాణ రంగంలో ఎకో ఫ్రెండ్లీ భవనాలు డిజైన్‌ చేస్తోంది. నెట్‌జీరో ఉండే పుష్కరిణి వంటి స్విమ్మింగ్‌ పూల్స్‌, ఆర్గానిక్‌ గార్డెన్స్‌, సోలార్‌ పవర్‌ పాడ్స్‌ ఇలా లైఫ్‌ స్పేసెస్‌ సెక్టార్‌లో జీరో కార్బన్‌ న్యూట్రాలిటీ సాధించే దిశగా మహీంద్రా రైజ్‌ అడుగులు వేస్తోంది.

చదవండి: ధ్యాంక్యూ సార్‌.. ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్‌ రిప్లై

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top