
కార్పొరేట్ ప్రపంచంలో క్షణం తీరిక లేకుండా ఉన్నా.. దేశంలో క్షేత్రస్థాయిలో జరిగే అంశాలపై దృష్టి పెట్టే ఇండస్ట్రియలిస్టులో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో అంశాలను గమనిస్తూ.. సీరియస్ అంశాలపై రెగ్యులర్‌గా స్పందిస్తుంటారు. తాజాగా తన కంపెనీపైనే ఆయన సెటైర్ వేశారు. అదే సమయంలో ఓ సీరియస్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు.
ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన వీడియోలో ఓవర్ లోడ్‌తో ఉన్న ఓ వాహానం దాదాపుగా అదుపు తప్పి పోతుంది. ముందు టైర్లు గాలిలో లేవగా అక్కడున్న ఇద్దరు ప్రమాదపుటంచుల వరకు వెళ్లారు. చివరకు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోను చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు ఓవర్ లోడ్ చేయడం వల్ల ట్రక్కుకి ఆ పరిస్థితి తలెత్తిందనే విషయం అర్థం అవుతుంది. కానీ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను మరో కోణంలో చూశారు.
The Auto Industry uses “Quality Function Deployment” (QFD) a structured approach to defining customer needs & translating them into specs of products to meet those needs. I don’t believe our engineers took these ‘needs’ into account when designing this Mahindra Supro Truck! 🙄 pic.twitter.com/CHGHj0Xwtz
— anand mahindra (@anandmahindra) February 4, 2022
మన దేశీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేయాలంటూ ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ వినియోగం/ డిమాండ్‌లో ఉండే వాహనాలు అన్నీ ఓవర్‌లోడ్‌తో వెళ్తుంటాయి. ముఖ్యంగా రూరల్ ఇండియాలో ఈ తరహా దృష్యాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ ఓవర్‌లోడ్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీగా వాహనాలను తయారు చేయాలంటూ ఇంజనీర్లకు సూచించారు. వాహనం డిజైన్‌లో కీలక అంశాలతో ఆదాయం తక్కువగా ఉండే రూరల్ ఇండియా అగ్రికల్చర్ సెక్టార్‌ని దానిపై ఆధారపడే వాళ్ల అవసరాలు కూడా కీలకమన్నట్టుగా ఆనంద్ స్పందించారు.
తన కంపెనీ వాహనం అదుపు తప్పడం, కొందరు ప్రమాదంలో పడటం వంటి అంశాలను కప్పిపుచ్చకుండా.. గ్రామీణ భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయాలంటూ ఆనంద్ మహీంద్రా సూచించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వాహనం డిజైన్‌లో తప్పేమీ లేదని.. అంత ఓవర్ లోడ్ వేస్తే ఎలాగంటూ కామెంట్లు చేశారు. కాగా ఇండియన్ జుగాడ్‌కి సంబంధించి పలు వీడియోలు కూడా కొందరు పోస్ట్ చేశారు.
చదవండి: Anand Mahindra : అగ్రికల్చర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఇకపై వాటికి చెక్