Anand Mahindra : అగ్రికల్చర్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌.. ఇకపై వాటికి చెక్‌

Our tech is anti VIP Tweeted By Anand Mahindra This is The Meaning Of that Tweet - Sakshi

కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయాన్ని ఆధునీకరిస్తామంటూ ప్రకటన వెలువడింది మొదలు ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో అగ్రికల్చర్‌లో టెక్నాలజీ వినియోగంపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అగ్రికల్చర్‌లో  వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చు. ఈ విషయంలో మహీంద్రా గ్రూపు ఏం చేస్తుందో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వీఐపీలు అన్‌ వెల్‌కమ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. 

మహీంద్రా గ్రూపు క్రిష్‌ 2 యాప్‌ని రూపొందించింది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న రైతులు ఎవరైనా.. తమ పంటలకు కీటకాలు, పురుగులు సోకినప్పుడు వాటిని ఫోటో తీసి అప్‌లోడ్‌ చేస్తే చాలు.. వెంటనే ఆ కీటకాలు తరిమేందుకు ఏ పురుగుల మందు వాడాలనే వివరాలు రైతు ఫోన్‌కి మెసేజ్‌లో వచ్చేస్తాయి. ఇదే విషయాన్ని తెలియజేసే వీడియోను షేర్‌ చేస్తూ.. మాది యాంటీ వీఐపీ టెక్నాలజీ. అది వీఐపీ ( వెరీ ఇంపార్టెంట్‌ పెస్ట్‌)లను పంటల్లోకి రానివ్వదంటూ క్యాప్షన్‌ పెట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top