
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మీరు గమనించినట్లయితే ఓ మదపుటేనుగు అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఈ సంఘటన చూస్తే ఎవరికైన ఒకింత భయం కలుగుతుంది, కానీ అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు మాత్రం అస్సలు జడుసుకోకుండా దైర్యంగా నిలబడి ఉన్నారు.
ఆ ఏనుగు వేగంగా వారి ముందు వచ్చి.. తరువాత వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ప్లే అయ్యే సమయంలో భయానికి రెండర్థాలు ఉన్నాయని.. ఒకటి అన్నీ మర్చిపోయి పరుగెత్తడం.. రెండు అన్నింటిని ఎదుర్కొని నిలబడటం అని కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే?
వీడియో షేర్ చేస్తూ ఆనంద మహీంద్రా.. మీ భయాన్ని ఎదుర్కోండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటికీ వేలమంది దీనిని లైక్ చేశారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Face your fear.
— anand mahindra (@anandmahindra) January 15, 2024
Look at it straight in the eye and it will turn away. #MondayMotivation pic.twitter.com/0RDvH2i9il