
యమహా కంపెనీ తన ఆర్15 వీ4 లైనప్‌ను రీఫ్రెష్ చేసింది. ఇందులో భాగంగానే కొత్త కలర్ (ప్రీమియం మెటాలిక్ గ్రే షేడ్) ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఇది వెర్మిలియన్ వీల్స్‌తో స్టీల్టీ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌ను పొందుతుంది. దీంతో ధరలు కూడా పెరిగాయి.
కొత్త కలర్ యమహా ఆర్15 వీ4 బైక్ ధరలు రూ. 1.67 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 2.01 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య ఉన్నాయి. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్‌షిఫ్టర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో లింక్డ్ టైప్ మోనోషాక్ వంటివి ఇందులో చూడవచ్చు.
2025 యమహా ఆర్15 వీ4 బైకులో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్పీ పవర్, 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇంజన్ డెల్టాబాక్స్ ఫ్రేమ్ లోపల ఉంటుంది. పనితీరు మాత్రమే స్టాండర్డ్ బైక్ మాదిరిగానే ఉంటుంది.