40 రకాల పూల మొక్కలతో బటర్‌ఫ్లై పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

40 రకాల పూల మొక్కలతో బటర్‌ఫ్లై పార్క్‌

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా బటర్‌ఫ్లై పార్కు ఏర్పాటు చేయగా, గురువారం కలెక్టర్‌ అంకిత్‌ ప్రారంభించారు. వైల్డ్‌లైఫ్‌ చెక్‌ పోస్టు ఎదుట సుమారు రూ.5 లక్షలతో 40 రకాల పూల మొక్కలతో పార్కు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ వైల్డ్‌లైఫ్‌ విభాగం ఎఫ్‌డీఓ బాబు తెలిపారు. సీతాకోకచిలుకలను ఎక్కువగా ఆకర్షించే జటోపా, లేగిసోమియా, నందివర్ధనం, ఎగ్జరా, క్యాసిమ్‌, మందార, వింకరోజ్‌, పిటోనియా, లాంటినా, వర్జీనా, నైట్‌క్వీన్‌, అమలందా, గల్‌ఫెమియా, విష్ణుకాంత తదితర రకాల మొక్కలు తెప్పించామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement