నడుస్తూ.. వాగులు దాటుతూ... | - | Sakshi
Sakshi News home page

నడుస్తూ.. వాగులు దాటుతూ...

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

నడుస్తూ.. వాగులు దాటుతూ...

ప్రస్తుత భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జన్మించిన నాకు చదువులో మార్గదర్శకుడు అన్న వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 3వ తరగతి ఉండేది. ఆ తర్వాత నాలుగు కి.మీ. అన్నయ్యతో కలిసి నడుస్తూ వాగులు దాటి స్కూల్‌కు వెళ్లేవాడిని. అలా మా గ్రామం నుంచి 15 మంది ఉండేవాళ్లు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో చెట్ల కింద కూర్చొని అంతా కలిసి హోంవర్క్‌ చేసుకునే వాళ్లం. పరీక్షల సమయంలో కూడా కలిసి చదువుకునేవాళ్లం. అమ్మనాన్నది వ్యవసాయ కుటుంబమైనా మమ్ముల్ని చదువుకోవాలని ప్రోత్సహించేవాళ్లు. అయితే, స్కూల్‌ దూరం కావడంతో ఇబ్బందిగా ఉందని కిన్నెరసాని గురుకులంలో చేర్పించారు. అక్కడ పదో తరగతి తర్వాత, భద్రాచలంలో ఇంటర్‌ పూర్తి చేసి అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ చదివాక ఉద్యోగం సాధించా. మా అన్నయ్య వెంకటేశ్వర్లు ఉన్నత విద్య పూర్తిచేసి సింగరేణిలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అందుబాటులో స్కూళ్లు లేకపోయినా అమ్మానాన్న ప్రోత్సాహంతో హాస్టళ్లలో ఉండి చదువుకోవడంతో ఈ స్థాయికి చేరాం. –ధనసరి పుల్లయ్య,

డీఏఓ, ఖమ్మం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement