అశ్వారావుపేటరూరల్: ఉపాధి కూలీ దంపతుల వివాహా వేడుకకు పని ప్రదేశమే వేదికగా మారింది. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆకుల శ్రీను–దుర్గ దంపతులు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం కూడా ఉపాధి పనికి వెళ్లారు. కాగా, వీరి వివాహామై శనివారం నాటికి పాతికేళ్లు నిండాయి. విషయం తెలుసుకున్న తోటి కూలీలు పూలు, ఆకులతో దండలు సిద్ధం చేశారు. తలంబ్రాలు తయారు చేశారు. దంపతులతో దండలు మార్పించి పెళ్లి తంతు జరిపించారు. స్వీట్లు పంపిణీ చేశారు. వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


