విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

విద్య

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి

ములకలపల్లి: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన వలస ఆదివాసీ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడ్డురామవరానికి చెందిన బోడా జగదీష్‌ అలి యాస్‌ చంటి ఛత్తీస్‌గఢ్‌ వలస ఆదివాసీలతో యర్రప్పగుంపు గ్రామ శివారులో మూడు రోజులుగా జామాయిల్‌ తోట నరికిస్తున్నాడు. బీజాపూర్‌ జిల్లా గుజ్జకుంట గ్రామానికి చెందిన మడివి బుద్రాం (24) బుధవారం చెట్టు నరుకుతుండగా, పక్కనే ఉన్న 220 కేవీ విద్యుత్‌ తీగలకు తగిలింది. అదే సమయంలో బుద్రాం నరికిన చెట్టును పట్టుకోవడంతో విద్యుదాఘాతానికిగురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘట నపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. బోడు ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన కొర్స రాంబాబు (31) బుధవారం బైక్‌పై ఆళ్లపల్లికి బయలుదేరాడు. గంగారం సమీపంలో ఎదురుగా వస్తున్న ఐస్‌క్రీమ్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాపర్‌ తీగ చోరీ

మణుగూరు రూరల్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌ను చోరీ చేశా రు. మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ వెంకటపతినగర్‌ పరిధిలోని కోడిపుంజుల వాగు సమీపంలో పొలాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్‌ ను పగులగొట్టి, అందులోని కాపర్‌ వైరును అపహరించారు. బుధవారం ఉదయం గుర్తించిన రైతులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడీఈ ఉమామహేశ్వరరావు, లైన్‌మెన్‌ ఇరుగు శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

విద్యుదాఘాతంతో  వలస కూలీ మృతి1
1/1

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి

Advertisement
 
Advertisement
Advertisement