 
															‘ఎస్‌ఐఆర్’ జాబితా సిద్ధం చేయండి
బూర్గంపాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ఓటర్ జాబితాను తప్పుల్లేకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. బూర్గంపాడు తహసీల్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో చేసిన ఎస్‌ఐఆర్‌తో ప్రస్తుత జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. శనివారం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, ఆర్‌ఐ నర్సింహారావు, వీర్రాజు, జీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గిరిజనుల విద్య బలోపేతానికి చర్యలు
అశ్వాపురం : గిరిజన చిన్నారుల విద్య బలోపేతానికి ఉద్దీపకం వర్క్ బుక్‌ను ప్రవేశపెట్టామని పీఓ రాహుల్ తెలిపారు. మండలంలోని కోరెంవారి గూడెం, రామవరం గిరిజన సంక్షేమ పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. పిల్లల సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్దీపకం వర్క్ బుక్‌తో విద్యార్థుల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, అయినా ఇంగ్లిష్ పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ తప్పులు కూడా లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీఆర్పీ గాంధీ, ఉపాధ్యాయులు సాయం కృష్ణయ్య, శోభన్‌బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
