 
															ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్‌లో గురువారం ఎంపిక చేశారు. సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈమేరకు వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య వెల్లడించారు. బాలుర విభాగంలో కె.రాంచరణ్, ఎం.చరణ్, కె.దిలీప్ కుమార్, కె.వినోద్‌కుమార్, వి.సంతోష్, జి.విజయవర్దన్, వెంకటయోగేశ్వర్, డి.ఆదిత్యప్రకాశ్, టి.మోహన్‌రెడ్డి, పి.దేవంత్ స్వామి, శివ శశాంక్, బాలికల విభాగంలో ఇ.అవంతిక, బి.సంజనశ్రీ, పి.హర్షిత, కె.జ్యోత్స్న, ఎం.గౌతమి, జె.సంస్కృతి ఎంపికయ్యారని తెలిపారు.
వసతి, సౌకర్యాలు
కల్పించాలి
భద్రాచలంటౌన్/టేకులపల్లి: గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డీడీ అశోక్ అన్నారు. ఐటీడీఏలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమ్మతులు, డైట్ చార్జీల నిధులు కేటాయించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. వసతిగృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు రాయడం, చదవడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో దమ్మపేట, ఇల్లెందు ఏటీడీవోలు చంద్రమోహన్, భారతీదేవి, సిబ్బంది రామకృష్ణారెడ్డి, రంగయ్య, హెచ్‌ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంట్లో గంజాయి నిల్వ
● నిందితుడి అరెస్ట్
మణుగూరు టౌన్: బంధువు మాట విని ఎక్కువ డబ్బుతో సంపాదించాలనే ఆశతో ఇంట్లో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి జైలుపాలయ్యాడు. గురువారం మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చల్లా సతీష్, అతని స్నేహితుడు రేపాకుల సాగర్ సీలేరు నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. సతీష్‌కు బాబాయి వరసయ్యే మణుగూరు గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన చల్లా శ్రీనివాస్ ఇంట్లో 3.5 కేజీల గంజాయిని నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టి, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడు చల్లా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, చల్లా సతీష్, సాగర్‌లను ములుగు పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగబాబు, ఎస్‌ఐలు నగేశ్, శ్రావణ్, సిబ్బంది సత్యనారాయణ ఉన్నారు.
గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం భద్రాచలం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ రహిమున్నిసా బేగం కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డు ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. గంజాయి తరలిస్తున్న మహ్మద్ హస్సన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయితోపాటు కారు, సెల్‌ఫోన్ సీజ్ చేశారు.
 
							ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
