‘ముందస్తు’ ముచ్చటేది ? | - | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’ ముచ్చటేది ?

Oct 30 2025 7:57 AM | Updated on Oct 30 2025 7:57 AM

‘ముంద

‘ముందస్తు’ ముచ్చటేది ?

● భద్రగిరిలో ముక్కోటి, నవమి, పుష్కరాలపై కనిపించని కసరత్తు ● శాశ్వత పనులపై శ్రద్ధచూపని అధికారులు ● ప్రణాళిక, అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు ప్రణాళికపై ఒత్తిడి తేవాలి

ఉత్సవాలకు ఎనలేని విశిష్టత..

● భద్రగిరిలో ముక్కోటి, నవమి, పుష్కరాలపై కనిపించని కసరత్తు ● శాశ్వత పనులపై శ్రద్ధచూపని అధికారులు ● ప్రణాళిక, అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే ముఖ్యమైన మూడు పండుగలు ముందే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి, వచ్చే ఏడాది మార్చి 27న శ్రీరామనవమి పండుగలు జరుగనున్నాయి. ఇక 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ పండుగలపై ఇంతవరకు ముందస్తు సమీక్ష, ప్రణాళికలు చేపట్టలేదు. భక్తులకు కల్పించాల్సిన శాశ్వత పనులపై ప్రణాళికాయుతంగా ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే తప్ప ఉత్సవాల నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. సమీక్షా సమావేశాల నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు విడుదల చేయించేలా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

ప్రణాళికపై అధికారుల నిర్లక్ష్యం..

ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఇందుకోసం మిథిలా స్టేడియం పక్కనున్న వేదిక ముందు సెక్టార్లుగా విభజించి టికెట్లు విక్రయిస్తారు. అయితే వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు ఇతర ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేసిన సెక్టార్లు భక్తులతో నిండిపోతాయి. దీంతో ఇతర సాధారణ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ప్రతీ ఏడాది ఇది పరిపాటిగా మారుతోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీరామనవమి రోజునా ఇదే సమస్య ఎదురవుతోంది. సీఎం సెక్టార్‌తో పాటు వీవీఐపీ సెక్టార్లు నిండిపోయి వెనుక, చుట్టుపక్కల ఉండే భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించలేకపోతున్నారు. ఇక గోదావరి పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ముందస్తు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక వసతుల కల్పన అత్యవసరం. కానీ నేటి వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ముందుస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శోచనీయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానఘాట్‌ల సంఖ్య పెంచడం, ప్రస్తుతం ఉన్న ఘాట్‌ల అభివృద్ధి, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అంటున్నారు.

మార్చి 27నే భద్రగిరిలో కల్యాణం..

భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీనే నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అస్పష్టత నెలకొని ఉంది. 26, 27 తేదీల్లో ఘడియలు వచ్చినప్పటికీ దేవస్థానంలో మిగులు గడియల్లోనే కల్యాణం జరపనున్నట్లు వైదిక సభ్యులు, ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం 26, 27 తేదీల్లో విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముక్కోటి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల ఉత్సవాలు భద్రాచలంలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత పనుల ప్రణాళికపై అధికారులు వెంటనే సమావేశాలు నిర్వహించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించకుంటే పుష్కరాల నాటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు.

– పోతురెడ్డి సుబ్బారెడ్డి, సారపాక

భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలకు ఎనలేని విశిష్టత ఉంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకలకు తరలి వస్తుంటారు. అలాగే 12 ఏళ్లకు ఓసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 ఆగస్టులో జరగనున్నాయి. అయితే ప్రతి ఏడాది జరిగే త్సవాలతో పాటు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా భద్రాచలంలో వసతి సౌకర్యాలు మెరుగు పడతాయని అంటున్నారు.

‘ముందస్తు’ ముచ్చటేది ?1
1/1

‘ముందస్తు’ ముచ్చటేది ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement