 
															వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
310 / 220
జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 
బొగ్గు ఉత్పత్తికి
అంతరాయం
కొత్తగూడెంఅర్బన్: మోంథా తుపాన్ ధాటికి సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్ల డించారు. కొత్తగూడెం ఏరియాలో రోజుకు 59,080 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 38,776 టన్నులు, ఇల్లెందు ఏరియాలో 20,833 టన్నులకు గాను 6,420 టన్నులు, మణుగూరు ఏరియాలో 41,460 టన్నులకు గాను 30,039 టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైందని వివరించారు. వర్షం ఇలాగే కొనసాగితే గురువారం కూడా నష్టం తప్పదని భావిస్తున్నారు.
కిన్నెరసానికి
కొనసాగుతున్న వరద
2వేల క్యూసెక్కుల నీరు
గోదావరిలోకి విడుదల
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల వరద రావడంతో బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 406.10 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
 
							వాతావరణ ం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
