 
															లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం
కొత్తగూడెంటౌన్: లొంగిపోయిన మావోయిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, బీజాపూ ర్, సుక్మా జిల్లాలకు చెందిన ముగ్గురు మావోయిస్టులు ఇటీవల లొంగిపోగా, బుధవారం తన కార్యాలయంలో వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో పని చేస్తూ లొంగిపోయిన వారికి పునరావాసం కోసం తెలంగాణ ప్రభుత్వం నగదు రివార్డులు మంజూరు చేసిందని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని, వారితో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. పార్టీ నాయకులు, సభ్యులు ఆయుధాలు వీడి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ(ఆపరేషన్స్) నరేందర్, ఆర్‌ఐ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
