 
															జెన్‌కో క్రీడా పోటీలు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీఆర్‌సీ టెన్నిస్ కోర్టులో బుధవా రం జెన్ కో క్రీడా పోటీలు ప్రారంభమయ్యా యి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్ ప్రాజెక్ట్‌స్ పోటీల్లో టెన్సిస్, చెస్, క్యా రమ్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ విభాగాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. 7వ దశ సీఈ కె. శ్రీనివాసబాబు, 5, 6దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావు క్రీడా పోటీలను ప్రారంభించి మా ట్లాడారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఉపయోగపడుతాయన్నారు. శ్రీశైలం, నాగర్జునసాగర్, పోచంపాడు, విద్యుత్‌సౌధ, బీటీపీఎస్, కేటీపీఎస్ 5,6,7 దశల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ లు యుగపతి, రాజ్‌కుమార్, జి.శ్రీనివాస్, వైసీసీఎ నాగరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు మహేష్, వీరస్వామి, నరసింహారావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
