 
															హరీశ్‌రావుకు పరామర్శ
ఇల్లెందు: మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం మృతి చెందగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని వారి నివాసంలో సత్యనారాయణ మృతదేహం వద్ద నివాళులర్పించాక హరీశ్‌రావు, కుటుంబీకులను పరామర్శించారు.
సెక్యూరిటీగార్డుకు పాముకాటు
మణుగూరుటౌన్: సింగరేణి ఓసీ–2లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీగార్డు పాముకాటుకు గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్ విధులకు హాజరైన శ్రీనివాస్ ఓసీ–2 గని సమీపంలోని 84 డీపీ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో కట్లపాము కాటుకు గురికావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, అధికారులు సింగరేణి ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
కోతుల దాడితో ఆటో బోల్తా
కల్లూరురూరల్: మండలంలోని ముగ్గు వెంకటాపురం శివారులో కోతుల గుంపు రావడంతో ఆటో బోల్తా పడింది. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వైపు మంగళవారం వెళ్తున్న ఆటో ముగ్గవెంకటాపురం శివార్లలోకి రాగానే కోతుల గుంపు ఆటోపైకి వచ్చింది. డ్రైవర్ ఆందోళన చెందగా ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
