 
															నిబంధనలు పాటించని క్లినిక్ సీజ్
భద్రాచలంఅర్బన్: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఓ క్లినిక్‌ను వైద్యాధికారులు మంగళవారం సీజ్ చేశారు. భద్రాచలంలోని డాక్టర్ ఆర్.నాగేశ్వర్‌రావు కాలనీలో ఓ మెడికల్ షాప్‌ను ఆనుకుని అనుమతి లేకుండా ప్రతీ ఆదివారం డెర్మటాలజిస్ట్‌ను పిలిపించి క్లినిక్ నిర్వహిస్తున్నారు. గతంలోనే అనుమతి తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా నిర్వాహకుడు పట్టించుకోకపోవడంతో మంగళవారం సీజ్ చేశారు. అలాగే, బ్రిడ్జి సెంటర్‌లోని సూర్య ఆస్పత్రిలో పరీక్షలకు అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీఎంహెచ్‌ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
