 
															అలరించిన నృత్య ప్రదర్శన
రేపు కిన్నెరసానిలో ఆర్చరీ పోటీలు
పాల్వంచరూరల్ : పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ మోడల్ స్కూల్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ రౌండ్ 30 నుంచి 20 మీటర్లు, రికర్వ్ రౌండ్ 60, కాంపౌండ్ డబుల్ 50 మీటర్ల పోటీలు ఉంటాయని, పాల్గొనే బాలబాలికలు 2008 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకుని రావాలని సూచించారు. ఇక్కడ ఎంపికై న బాలబాలికలు తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా తరఫున ఆడుతారని పేర్కొన్నారు.
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. అభినయ కూచిపూడి నృత్యాలయ బృందం ఆధ్వర్యంలో మంగళవారం చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
