 
															భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
అశ్వాపురం/మణుగూరురూరల్ : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్ కార్యాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు మణిధర్, అద్దంకి సురేష్, డిప్యూటీ తహసీల్దార్లు అనూష, రాజేశ్వరరావు, రామారావు, ఆర్‌ఐ లీలావతి, యూడీసీ కనకలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కుంజా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
