 
															గుంతల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
మణుగూరు రూరల్ : కొత్తగూడెం – మణుగూరు – ఏటూరునాగారం రహదారిపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రోడ్లపై గుంతలతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్‌టీ నిధులు ఎక్కడికి తరలిపోతున్నాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా.. నిధులు సున్నా అని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పోశం నర్సింహరావు, కుర్రి నాగేశ్వరరావు, కె. లక్ష్మణ్, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, నూకారపు రమేష్, అక్కి నర్సింహరావు, వేర్పుల సురేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
