 
															గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందిస్తాం
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు హాజరైన వారి నుంచి ఆయన ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీడీ అశోక్, ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏఓ రాంబాబు, ఇన్‌చార్జ్ ఎస్‌ఓ భాస్కరన్, ఉదయ్‌కుమార్, ఏపీఓ పవర్ వేణు, రాజారావు, ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, నారాయణ రావు, వెంకటేశ్వరరావు, లింగా నాయక్, జయరాజ్, ఏఓ నరేందర్ పాల్గొన్నారు.
ఉద్యోగాల కల్పనకు డిజిటల్ ప్లాట్‌ఫామ్
గిరిజన నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశామని పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు – ఉద్యోగం కల్పించే పరిశ్రమలకు మధ్య ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (వెబ్‌సైట్) వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత https//deet.telangana.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతను బట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్ల డించారు. వివరాలకు ఐటీడీఏ ఆవరణలోని భవిత సెల్‌లో సంప్రదించాలని కోరారు.
ఐటీడీఏ పీఓ రాహుల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
