భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలోని అన్ని కాలనీల వారు ఇళ్లలో ఏర్పడే చెత్తను గ్రామ పంచాయతీ ఆటోల్లోనే వేయాలని, కరకట్ట ప్రాంతాల్లో వేస్తే భారీ జరిమానా విధిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇతరులు సోమవారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పీఓ, సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం కరకట్ట ప్రాంతంలో వేసే చెత్తతో వచ్చే దుర్వాసన, కొందరు ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాల వారితో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. త్వరలో కరకట్ట వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రానున్న వారం రోజుల్లో కరకట్ట ప్రాంతం అంతా శుభ్రం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈఓ శ్రీని వాసరావు, డీడీఎంహెచ్‌ఓ చైతన్య పాల్గొన్నారు.
సిలబస్ పూర్తి చేయాలి
దుమ్ముగూడెం: ఇంటర్ సిలబస్ త్వరగా పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాలని రాష్ట్ర ఇంటర్మీడిఝెట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. సోమవారం ఆయన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజువారీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను 80 శాతానికి పెంచాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ కాని విద్యార్ధులకు ఈ రిజి స్ట్రేషన్ చేయించాలని సూచించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలని, వాటిని అటెండెన్స్ రికార్డులో నమోదు చేయాలని అన్నారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
