 
															విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు షురూ..
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు మాట్లాడుతూ.. విజిలెన్స్ విజిలెన్స్ విభాగం సింగరేణిలో అంతర్భాగమని అన్నారు. ప్రతీ పనిలో నీతి నిజాయితీ, పారదర్శకత అవసరమని, తద్వారా సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అవినీతికి వ్యతిరేక జరిగే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ మేనేజర్ విజిలెన్స్ ఎస్‌డీ షాకీర్ మొహినుద్దీన్ ఉద్యోగులతో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ జీఎం కె.ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికారులు కవితానాయుడు, జి.వి.కిరణ్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి. రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, సీఎంఓఏఐ కార్పొరేట్ అధ్యక్షుడు ఎస్.వెంకటాచారి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
