 
															బీటీపీఎస్ సీఎస్సార్ నిధులు రూ.2.50 కోట్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): మణుగూరు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సోమవారం ఐడీఓసీలో కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కలిశారు. బీటీపీఎస్ సీఎస్సార్ నిధుల కింద రూ 2.50 కోట్ల డీడీని అందజేశారు. మణుగూరు నుంచి ఏడూళ్ల బయ్యారం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణం, భూ సేకరణలో రైల్వేలైన్ సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వినియోగించనున్నారు.
నేటి బీఆర్‌ఎస్ ధర్నా వాయిదా..
మణుగూరు టౌన్: రోడ్డు మరమ్మతులకు రూ.2.50 కోట్ల మంజూరు నేపథ్యంలో మంగళవారం బీటీపీఎస్ గేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి రూ.వందల కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు రాబట్టే వరకు దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
